Hijra Thieves | మనూరు, ఏప్రిల్ 17: ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతుండటం చూస్తూనే ఉంటాం. దొంగతనం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నట్టుగా మారిపోయింది. కొన్ని సార్లు దొంగ తెలివి తేటల ముందు ఏవీ పనికిరావనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఇద్దరు వ్యక్తులు దొంగతనం కోసం అలాంటి తెలివితేటలే వాడి అడ్డంగా బుక్కయిపోయారు.
మారువేషంలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గ్రామస్తులు పట్టుకొని చితక బాదారు. ఈ సంఘటన మండల కేంద్రం మనూర్లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం ఇద్దరు మగవాళ్లు చీరలు ధరించి హిజ్రాల్లాగా మారి భిక్షాటన చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఇద్దరు వ్యక్తులు మనూరులోని అంబన్న హోటల్లో దొంగతనం చేయడంతోపాటు సయ్యద్ మన్నన్ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. వీరిని గ్రామస్తులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత