Professor shanti | నిజాంపేట, జూన్ 3 : యాజమాన్య పద్ధతులను అవలంభించి అధిక దిగుబడులు సాధించవచ్చని జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతి అన్నారు. మంగళవారం నిజాంపేటలోని రైతువేదికలో విత్తనోత్పత్తి పథకంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రొఫెసర్ శాంతి పాల్గొన్నారు.
ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ..అధిక దిగుబడులతో సాధించిన నాణ్యమైన మూలవిత్తనంను ఇతర రైతులకు పంపిణీ చేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం రైతులకు వరి, పెసలు మినీ కిట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఏవో సోమలింగారెడ్డి, ఏఈవో రమ్య, మౌనిక, చల్మెడ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, నిజాంపేట మాజీ ఉపసర్పంచ్ బాబు, రైతులు చంద్రశేఖర్, నరేశ్ మహంకాళి, శ్రీనివాస్, మురళి తదితరులు ఉన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా