Heavy rain | రామాయంపేట, జూలై 19 : రామాయంపేట పట్టణంలో శనివారం ఉదయం నుండి ఎండవేడిమితో ఉండగా.. ఒక్కసారిగా మధ్యాహ్నం పూట ఆకాశం మేఘావృతమైపోయింది. కొద్దిసేపట్లోనే జోరు వాన ఊపందుకుంది. రెండు గంటలపాటు వర్షం జోరుగా కురిసింది. వర్షం ఒక్కసారిగా రావడంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది.
ఎవరూ ఊహించనంతగా అప్పటికప్పుడే వర్షం దంచి కొట్టడంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించడంతోపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు గత 15 రోజులుగా రాని వర్షం ఒక్కసారిగా దంచి కొట్టడంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది. భారీ వర్షానికి పాత జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.
అధికారులు వెంటనే రంగంలోకి దిగి పనులు క్లియర్ చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులు వెళ్లిపోయారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత