Fertilizers | మెదక్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో వరి నాట్లు వేసిన రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు భారీగా క్యూలైన్లో నిలిచి ఉంటున్నారు. ఫోన్లో యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువుల దుకాణానికి రావాలని వ్యవసాయ అధికారులు తెలపడంతో యాప్ గురించి మాకు తెలియదని రైతులు అంటున్నారు.
శనివారం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో ఎరువుల కోసం రైతులు భారీగా క్యూలైన్లు నిలిచి ఉన్నారు. ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఉదయం నుంచి దుకాణం ముందు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యాప్లో బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తామని తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదని ఎలా బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో యూరియా కొరత ఉండడంతో రైతులు ఎరువుల కోసం కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.
Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు