gurukul student |మెదక్ రూరల్ (హావేలి ఘన్ పూర్) అక్టోబర్ 07 : హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన జశ్వంత్ పదవ తరగతి విద్యార్థి. ఆతియా పాతియా క్రీడా పోటీల్లో నేషనల్ ఛాంపియన్ షిప్ 2025కు ఎంపిక అయ్యాడని అక్టోబర్ చివరి వారంలో జరిగే నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ కు కర్ణాటక వెళ్తున్నాడని ప్రిన్సిపాల్ సృజన అన్నారు.
గురుకుల పాఠశాల నుండి నేషనల్ లెవెల్ ఆటల పోటీలకు ఎంపికైనందుకు జశ్వంత్‌ను, పిఈటి రేవంత్ ను ప్రిన్సిపాల్ సృజన అభినందించారు. ఆటల పోటీలు శారీరక ఆనందంతోపాటు మానసిక స్థైర్యాన్ని అందిస్తాయని గురుకులలో ఉండే విద్యార్థులకు చదువుతోపాటు ఆటల పోటీల్లో ఉత్సాహపరుస్తున్నామని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సృజన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ సంతోష్, డిప్యూటీ వార్డెన్ బుర్ర సంతోష్, మిగతా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ