Grain Purchase Centre | మెదక్ రూరల్, అక్టోబర్ 14 : ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్ రెడ్డి పేర్కోన్నారు.
మంగళవారం హవేలి ఘన్ పూర్ మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కోనుగోలు కేంద్రంను మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటను, దళారులను నమ్మి అమ్మవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు నిర్వాహకులు, రైతులు తది త రులు ఉన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య