RDO Ramadevi | రామాయంపేట, మే 16 : కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కొనుగోలు వేగం పెంచడంతోపాటు రైస్‌మిల్లులకు చేరుకున్న ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయాలని మెదక్ ఆర్డీవో రమాదేవి పేర్కొన్నారు. ఇవాళ రామాయంపేటకు విచ్చేసిన ఆర్డీవో.. తహసీల్దార్‌తో కలిసి రైస్‌మిల్లులను, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు.
రామాయంపేట మండలవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నుండి రైస్‌మిల్లులకు చేరుకున్న లారీలను రైస్‌మిల్ ఓనర్లు మిల్లుకు ధాన్యం లారీలు రాగానే లోడింగ్ చేసుకోవాలన్నారు. ధాన్యం కేంద్రాల్లోని కొనుగోలును వేగంగా తూకం వేసి లారీలలో ధాన్యం పంపించాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నిర్వాహకులపై చర్యలు ఉంటాయన్నారు.
ఇంచార్జిలు ధాన్యం వద్దనే ఉండి అన్ని చూసుకోవాలని ఆర్డీవో రమాదేవి అన్నారు. హమాలీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకుని లారీలలో సాధ్యమైనంత తొందరగా ధాన్యం లోడింగ్ చేయాలని తెలిపారు. ధాన్యం మ్యాచర్ రావడంతోనే వెంటనే తూకం వేయాలని అన్నారు.
రైస్‌మిల్లర్లు కూడా రైస్‌మిల్‌కు లారీలలో వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేయాలన్నారు. రైస్‌మిల్ ఓనర్లు కూడా కొనుగోలు కేంద్రాలకు సహకరించాలన్నారు. లారీలను తొందరగా లోడింగ్ చేస్తే ధాన్యం వర్షాలకు తడవకుండా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి, ఆర్ఐ.గౌస్ ఉన్నారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం