MRO Rajinikumari | రామాయంపేట, మే 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకాలు వేసి ఉన్న వరి ధాన్యం బస్తాలను వెంటనే రైస్మిల్లకు తరలించాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి అన్నారు. ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
తూకం పెట్టిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా తరలించాలన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందని అందు కోసం రైతుల ధాన్యం తడవకుండా ఉండేందు కోసం టార్ఫాలిన్లు వినియోగించాలన్నారు. లేకుంటే ధాన్యాన్ని వెంటనే లారీలలో రైస్‌మిల్లులకు తరలించే ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ గౌస్ తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యల కోసమే ప్రజావాణి..
రామాయంపేట, మే 19ః ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహించిందని సమస్యలు ఉన్న వారు నేరుగా మండల కేంద్రానికి రావాలని తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఇవాళ ప్రజావాణిలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ, మండల వాసులు తమ విజ్ఙప్తులను తహసీల్దార్‌కు అందజేశారు. వినతులను పరిశీలించి స్థానికంగా ఉండే సమస్యలను ఇక్కడే పరిష్కారం చేయడం జరుగుతుందని తహసీల్దార్ రజినీకుమారి అన్నారు. ఇక్కడ కాని ఎడల కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులను పంపించడం జరుగుతుందని తెలిపారు.