Govt Schools | చేర్యాల, మే 16 : ప్రభుత్వ బడులే దేవుళ్ల గుళ్లు.. బాలలే దేవుళ్లని, పాఠ్యపుస్తకాలే పవిత్ర గ్రంథాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎలికట్టె అయిలయ్య, పీఎస్ హెచ్ఎం పిన్నింటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు.
ఇవాళ చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో ముందస్తు బడిబాట, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్, ఉల్లాస్ , హ్యాపీ ప్లే స్కూల్ తదితర విద్యా సంబంధ బహుళ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంలు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులున్నాయని, విద్యార్థులను సర్కారు బడిలో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది రామాంజనేయులు, ఎస్.నిరుపమా, అందే విజయ్‌కుమార్, గొట్టం ప్రకాశ్‌రెడ్డి, కర్రోల్ల స్వర్ణకుమార్, పి.రాజేశ్వరి, ఎస్.కనకలింగం, బోపూరి బాల్‌రెడ్డి, బొల్లం సంపత్, స్వామితో పాటు మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, నాయకులు బండకింది కర్ణాకర్, గూడెపు మహేష్, ప్రజ్ఞాపురం నర్సింహులు, మోకు దేవేందర్‌రెడ్డి, కుందారపు రాములు, పంచాయతీ కార్యదర్శి ఏలూరు రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం