Girl Missing | చేగుంట, జూలై 15 : కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాలకు హజరు కాకపోవడంతో చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేగుంట కస్తూర్బాపాఠశాలలో విద్యార్థిని అదృశ్యం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పరిశీలించారు. కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చిన 16 సంవత్సరాల బాలిక గత వారం రోజులుగా రాకపోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగ్రీ గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికకు తండ్రి లేకపోవడం, తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో ఆ బాలికను పెద్దమ్మ, మేనమామలు చేగుంట కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. చేర్పించిన నాలుగు రోజులకు బాలిక మేనమామనంటూ వచ్చి ఒక వ్యక్తి బాలికను తీసుకెళ్లాడు. ఈ నెల 7వ తేదీన బాలికను తీసుకెళ్లగా.. వారం రోజులు గడిచిన బాలిక ఆచూకీ లేకపోవడంతో, మిస్టరీగా మారింది.
ఇట్టి విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, ఉపాధ్యాయులతో కలిసి చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాధికారి రాధాకిషన్లను సోమవారం పాఠశాలకు చేరుకొని బాలిక అదృశ్యంపై సబ్బందితో చర్చించారు.చేగుంట పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా దర్యాప్తులో ఉన్నట్లు తెలిసింది.
ఇట్టి విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణితో మాట్లాడగా బాలికలకు సంబంధించి వారి తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపిచడం జరుగుతుందని, బాలిక తల్లితో ఫోన్లో మాట్లాడిన తరువాత బాలికను పంపించడం జరిగిందని శ్రీవాణి తెలిపారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి