Purchase Centres | రామాయంపేట, ఏప్రిల్ 29 : రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధరలు లభిస్తాయని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఇవాళ రామాయంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. రైతులకు నాణ్యమైన ధర లభిస్తుందన్నారు. ఇప్పటికే రెండు మండలాల వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
ప్రతీ గింజ కూడా ఎక్కడా పోకుండా పీఏసీఎస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరుపాలన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రభాతరావు, రమేశ్‌రెడ్డి, సరాఫ్ యాదగిరి వెంకటి, సీఈవో, నర్సింహులు, ఐలయ్య, లద్ద నర్సింహులు తదితరులు ఉన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి