నిజాంపేట,మే9 : మండలంలోని నగరం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్లారెడ్డి దవాఖాన సిబ్బంది ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్ శుక్రవారం ప్రారంభించారు. దాదాపు 100 మంది పైగా గ్రామస్తులకు వైద్యసిబ్బంది బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి దవాఖాన డాక్టర్లు సంజీవ్, సంజయ్‌రెడ్డి, మేనేజర్ మహమూద్, మార్కెటింగ్ ఇంచార్జ్ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
MacGill: కొకైన్ సరఫరా కేసులో.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు శిక్ష
Kantara 2 | జూనియర్ ఆర్టిస్ట్ మృతితో మాకు ఎలాంటి సంబంధం లేదన్న కాంతార 2 టీం
Fact Check | ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న పాకిస్థాన్.. నిజమో కాదో ఎలా ఈజీగా చెక్ చేయండిలా!