Yashwanth Reddy | టేక్మాల్, నవంబర్ 19 : అధికార దాహం, పదవీకాంక్షతో ఎన్ని ఆరోపణలు చేసినా నిజం మాత్రం కాస్త ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గెలుపొందిన సొసైటీ చైర్మన్‌పై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవమని తేటతెల్లమయ్యాయి.
పార్టీ మారుతారా? లేదా చైర్మన్ పదవిని కోల్పోతారా? అని ఎన్ని ఒత్తిడులకు గురిచేసినా ఏ మాత్రం తలొగ్గకుండా తాము నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి హైకోర్టులో న్యాయం లభించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యశ్వంత్ రెడ్డినే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా కొనసాగిస్తూ డీసీవో ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనకు డీసీవో కరుణాకర్ ఉత్తర్వులను అందజేశారు.
పాత పాలక వర్గాన్ని యదాతథంగా..
టేక్మాల్ సొసైటీ ఛైర్మన్ గా కొనసాగుతన్న ఆయనపై కాంగ్రెస్ పార్టీ బలపర్చిన డైరక్టర్లు కొందరు అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీసీవో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అవినీతి ఆరోపణలు నిరూపితం కాకుండానే తనను ఏ విధంగా సస్పెండ్ చేస్తారని యశ్వంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి కాకుండానే కొందరి డైరక్టర్ల ఫిర్యాదు, అధికార పార్టీ ప్రోద్భలంతో తనను సస్పెండ్ చేయడం సరికాదని కోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 15వ తేదీలోపు సరైన న్యాయం జరగకపోతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ కమిషనర్, మెదక్ జిల్లా డీసీవో కోర్టుకు హాజరు కావడంతోపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హాజరుకావాల్సిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో పాత పాలక వర్గాన్నే కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. అంటే ఇన్నాళ్లుగా అక్రమంగా అధికార పార్టీకి అండగా, వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ అన్యాయంగా పాలక వర్గంపై వేటు వేశారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
అవినీతి ఆరోపణలు రుజువుకాలేదని..
ఈ నేపథ్యంలో సొసైటీ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా యశ్వంత్ రెడ్డిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువుకాలేదని, అందుకు తాము సస్పెండ్‌ను ఎత్తివేస్తూ 2014 ఆగస్టు 14 తేదీకి ముందు ఉన్న పాలక వర్గాన్ని కొనసాగించనున్నట్లు పేర్కొనడంతో పాత పాలక వర్గాన్ని యదాతథంగా కొనసాగిస్తున్నట్లు నవంబర్ 19, 2025న డీసీవో ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో పాత పాలక వర్గమే కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడైంది.
పర్సన్ ఇంచార్జీ ఛైర్మన్ యశ్వంత్ రెడ్డి, పర్సన్ ఇంచార్జీ సభ్యులుగా వెంకయ్య, ఆకులపల్లి పాపయ్య, సాదు కిషన్, చందర్, బాగారెడ్డిగారి నర్సింహారెడ్డి, మంగమ్మ, పులి సత్యనారాయణ, ముదియాడ శ్రీశైలం, నాయికోటి శ్రీరాములు, సర్వని లక్ష్మిలు కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో నేటి నుంచి టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత పాలక వర్గమే కొనసాగనుంది.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్