Farmers | రామాయంపేట రూరల్, ఆగస్టు 25 : వర్షాలు రాకరాక ఆలస్యంగా రావడంతో అప్పటిదాకా నిరాశలో ఉన్న రైతన్నల్లో ఆశలు చిగురించాయి. అయితే వర్షాలు కురిశాయని ఆనందం పడేలోపే అన్నదాతలు సాగు చేసిన పంటలకు మాత్రం అవసరమయ్యే యూరియా కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరిపడా యూరియా అందక రైతన్నల ఆశలు అడియాశలు అవుతున్నాయి.
యూరియా కోసం ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు సోమవారం సిద్దిపేట-మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ కూడా యూరియా కోసం ఇంత ఇబ్బంది పడలేదని రైతులు అన్నారు. వచ్చిన యూరియా కోసం గంటల తరబడి పడి గాపులు కాయల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు