Farmer Registrations | రామాయంపేట, మే 16: రామాయంపేట డివిజన్ వ్యాప్తంగా ఉన్న రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్లను చేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ డివిజన్ అధికారి రాజ్నారాయణ పేర్కొన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్లను ఆధార్ కార్డు ద్వారా చేశారు.
అనంతరం డివిజన్ అధికారి రాజ్నారాయణ మాట్లాడుతూ.. రామాయంపేట మండల వ్యాప్తంగా 14వేల ఎకరాల భూమి ఉందని.. అందుకు సంబంధించిన రైతులు 7వేల పైచిలుకు ఉంటారన్నారు. ఇప్పటి వరకు 1150 మంది రైతులకు సంబంధించి ఆధార్ కార్డు ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల కొంత జాప్యం జరుగుతుందన్నారు.
రామాయంపేట డివిజన్ పరిధిలోని నిజాంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు రాజ్నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రాజు, సాయికృష్ణ, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్, ఝాన్సిలింగాపూర్, లక్ష్మాపూర్ గ్రామాలలో కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం