IKP Centres | మెదక్ రూరల్, అక్టోబర్ 08 : మెదక్ మండల పరిధిలోని పాతూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ , ఏపీఎం నాగరాజ్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్లైన్ లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు.
ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని తహసీల్దార్, వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్