Tarpaulin covers | నిజాంపేట, మే17 : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆర్ఐ ప్రీతి నిర్వాహకులకు సూచించారు. ఇవాళ నిజాంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్, చల్మెడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ సందర్శించి మాట్లాడారు.
వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లను కప్పుకోవాలని ఆర్ఐ ప్రీతి సూచించారు. తూకం వేసిన ధాన్యంను వెంటనే లారీలలో గోదాంకు తరలించాలన్నారు. అంతకముందు ఆయన కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఆర్ఐ వెంట నిర్వాహకులు మంగ, వాణి, రైతులు స్వామి, రాజయ్య, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు