Farmer | చిలిపిచెడ్, మార్చి 24 : అన్నదాతలు వరి పంటకు నీరందించక దిక్కుదోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంటలు నీరు కరువై ఎండిపోతుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
చిలిపిచెడ్ మండలంలోని సోమక్క పేట, గౌతాపూర్, గంగారం, జగ్గంపేట, రాందాస్ గూడ, ఫైజాబాద్,గిరిజన తండాలు టోప్యి తండా, బద్రియ తండా, గన్య తండా తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన వందల ఎకరాల్లో వరి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి.
భూగర్భజలాలు గరిష్ట స్థాయికి పడిపోవడంతో బోర్లలో చుక్కనీరు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు గాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కూలీల ఖర్చులు, ఎరువుల కొనుగోలు భారమవడంతోపాటు పశువులకు పశుగ్రాసం కూడా మిగిలే పరిస్థితి లేదని రైతులు వరి పంటను చూసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.
తెలంగాణలో రైతన్నల దయనీయ పరిస్థితి ఎలా ఉండో మరోసారి అద్దం పడుతున్నాయి.