Farmers | మెదక్ రూరల్, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో వరి నాట్లు వేసిన రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు భారీ సంఖ్యలో క్యూలైన్లో ఉండి పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల పరిధిలో సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతోపాటు యాప్ గురించి రైతులకు తెలియక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంటల సాగు కీలక దశలో ఉండగా ఈ రెండు సమస్యలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధికారులు యాప్‌పై అవగాహన కల్పించినప్పటికీ
రైతులు యాప్‌లో నమోదు, ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ ప్రక్రియలు సరిగా తెలియక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. చాలామంది రైతులకు స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండటంతో ఎరువులు పొందలేక వెనుదిరుగుతున్నారు.
ఫోన్లో యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువుల దుకాణానికి రావాలని వ్యవసాయ అధికారులు తెలపడంతో యాప్ గురించి మాకు తెలియదని రైతులు అంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తామని తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదని ఎలా బుక్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
మాకు ఎరువులు అందుబాటులో ఉంచాలి : మోహన్, సుల్తాన్ పూర్ హవేలీ ఘన్పూర్ మండలం
ఎరువులు దొరకడం ఒక సమస్య అయితే, యాప్ ఎలా వాడాలో తెలియక మరో సమస్య ఎదురవుతోంది. మా రైతులకు కావలసిన ఎరువులు మా మండలం పరిధిలో సరఫరా చేయాలి. అక్కడ లేకపోవడం వల్ల నేను మెదక్ జిల్లా కేంద్రం కు రావడంతో ఇబ్బందులకు గురి అవుతున్నాం.

Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు