Farmers | రామాయంపేట, జూన్ 19 : రైతులు తమ భూమి సమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని భూ భారతిలో తమ దరఖాస్తును అందించి సమస్యను పరిష్కరించుకోవాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. గురువారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలోని రైతువేదికలో భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
ప్రతీ రైతు తమ భూమికి సంబంధించి సమస్యను రెవెన్యూ అధికారులతో పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసమే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతీ రైతు తమ సమస్యలను నేరుగా భూ భారతిలో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల కోసమే గ్రామా గ్రామాన రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తుందన్నారు.
రాయిలాపూర్లోని రెవెన్యూ సదస్పుకు వందలాదిగా రైతులు ఆర్జీలు ఇచ్చేందుకు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహేందర్, ఏఈవో సాయికృష్ణ, ఆర్ఐ గౌస్ తదితరులున్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు