దుబాయ్: ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో విఫలమైనా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో అతడు.. 875 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఇక ఈ టోర్నీకి ముందు భారత జట్టుతో చేరిన ఇషాన్ కిషన్.. ప్రపంచకప్‌లో 317 రన్స్‌తో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి (871 పాయింట్లు) ఎగబాకాడు. ఫర్హాన్ (పాకిస్థాన్), సాల్ట్ (ఇంగ్లండ్), నిస్సాంక (శ్రీలంక) టాప్-5లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. టాప్-10లో బుమ్రా ఆరోస్థానంలో ఉన్నాడు.