Vanadurga Project | పాపన్నపేట, జూలై 26 : గత ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వన దుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. దీంతో రైతన్నలు సంతోషంలో పులకరించిపోతున్నారు. కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. దీంతో సుమారు 22 వేల ఎకరాల పంట పొలాలకు నీరందనుంది.
ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు సాగునీరందనుంది. ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాల రైతులు నాట్లు ప్రారంభించారు. అయితే సింగూరు ప్రాజెక్టు నుంచి విడతల వారిగా ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడవాల్సింది.. కానీ అధికారులు ఇప్పటివరకు నీరు వదలలేదు.
సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు వదలాలని రైతులు కోరుతున్న సమయంలో వరుణుడు కరుణించి వరదలు రావడంతో ప్రాజెక్టు నిండుకుంది. ఏది ఏమైనా ఘనపూర్ ప్రాజెక్టు నిండుకోవడంతో ప్రాజెక్టు పరిధిలోని ఎఫ్ఎన్, ఎంఎన్ కెనాళ్ల ద్వారా దిగువకు నీటిని వదిలారు. దీంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన