Farmer | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతుల ప్రాణాలు తీస్తోంది. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయండంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొంటారా.. లేదా..? అనే దిగాలుతో ప్రాణాలు కోల్పోతున్నారు.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగ్రహారం గ్రామానికి చెందిన రైతు రాజయ్య (45) వరి పంట సాగు చేశాడు. రాశులు చేసి అమ్మేందుకు సిద్ధంగా ధాన్యం అమ్ముడుపోక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో వరి ధాన్యం కొని ఉంటే రైతు బతికి ఉండేవాడని వాపోయారు. రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.
Chattogram | బంగ్లాదేశ్లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు