Chattogram | బంగ్లాదేశ్‌లో భారతీయ దౌత్యవేత్త అనుమానాస్పద మృతి.. గుండె పోటే కారణమా..?
Chattogram : బంగ్లాదేశ్‌లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్‌లో జరిగింది.
Chattogram : బంగ్లాదేశ్‌లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్‌లో జరిగింది. మృతుడిని నరేన్ ధర్గా గుర్తించారు. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛట్టోగ్రామమ్లో నరేన్ ధర్ అనే అధికారిక భారత దౌత్య కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని ఓల్డ్ వీసా సెంటర్ బిల్డింగ్ పరిధిలో గుర్తించారు. సెకండ్ ఫ్లోర్లోన బాత్రూమ్ డోర్ వద్ద నరేన్ మృతదేహం పడి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దౌత్య అధికారి కాబట్టి, అదనపు ప్రోటోకాల్ పాటిస్తూ అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బంగ్లాదేశ్ పోలీసు అధికారులు తెలిపారు. నరేన్ మృతదేహాన్ని ఛట్టోగ్రామ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపించినట్లు సిటీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమినూర్ రషీద్ తెలిపారు. అతడి మృతికి గల కారణాలు తెలియలేదన్నారు.
కార్డియాక్ అరెస్ట్ కారణంగానే నరేన్ మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అతడి మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని రషీద్ తెలిపారు. అలాగే, ఆయన మృతి ఘటనలో అనుమానాస్పదంగా ఏమీ అనిపించలేదని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామన్నారు. నరేన్.. ఇండియాలోని చండీగఢ్‌కు చెందినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం గురించి ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

