Heart Attack | పెద్ద శంకరం పేట, అక్టోబర్ 28 : పెద్ద శంకరం పేట మండలం వీరోజిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కిష్టప్పగారి కిషన్ (70) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. కిషన్‌కు గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిషన్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కిషన్ మృతి పట్ల నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే సంతాపం..
పెద్ద శంకరం పేట మండల పరిధిలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మండల బీఆర్ఎస్ నాయకుడు కిషన్ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి పార్టీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కిషన్ సర్పంచ్‌గా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని.. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.

Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Shaligouraram | తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయడంలే.. శాలిగౌరారంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
Cyclone Montha | దూసుకొస్తున్న ‘మొంథా’.. అల్లకల్లోలంగా ఒడిశా తీరం.. Video