Padma Devenderreddy | మెదక్ రూరల్, నవంబర్ 17 : హవేలి ఘనపూర్ మండలం మద్దుల్వాయి మాజీ సర్పంచ్ గుండారం కిరణ్ గౌడ్ తండ్రి గుండారం రామచంద్ర గౌడ్ ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం ముత్తాయికోట గ్రామానికి చేరుకొని రామచంద్ర గౌడ్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ సర్పంచ్ కిరణ్ గౌడ్‌ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని అందించారు. రామచంద్ర గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కో కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ శివ, నాయకులు ఫాజిల్, సోహెల్, స్వామి నాయక్ తదితరులు ఉన్నారు.
Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!