Right to Vote | నర్సాపూర్, మార్చి19 : 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్డీవో మహిపాల్ వెల్లడించారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్ఎస్ఆర్ 2025కు సంబంధించిన ఓటర్ వివరాలను పార్టీ నాయకులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా ఆర్డీవో మహిపాల్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల వయసు నిండిన యువతీయువకులకు ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతీ ఓటర్ ఆధార్ అనుసంధానం చేయవలసిందిగా కోరారు.
పోలింగ్ బూత్‌కు బీఎల్ఏలను నియమించి వారి జాబితాను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.