Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్కమ్ చెప్పింది. అయితే సునీతా విలియమ్స్ భుమిపైకి వచ్చిన అనంతరం ఆమె గురించి.. అంతరిక్షం గురించి.. వాటి మీద వచ్చిన సినిమాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతరిక్షం ఆధారంగా వచ్చిన హాలీవుడ్, ఇండియన్ సినిమాలను ఒకసారి చూసుకుంటే..!
2001: ఎ స్పేస్ ఒడిస్సీ (1968)
2001: A Space Odyssey
హాలీవుడ్ నుంచి వచ్చిన మొట్టమొదటి అంతరిక్షం ఆధారిత చిత్రాలలో 2001: ఎ స్పేస్ ఒడిస్సీ (2001: A Space Odyssey) ఒకటి. 1968లో వచ్చిన ఈ సినిమాకు స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వం వహించగా.. కీర్ డల్లెయా, గ్యారీ లాక్వుడ్, విలియం సిల్వెస్టర్ కీలక పాత్రల్లో నటించారు. మానవ ఉద్భవం, అంతరిక్ష యాత్ర ఆధారంగా వచ్చిన చిత్రమిది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
గ్రావిటీ (2013)
Gravity Movie
2013లో హాలీవుడ్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం గ్రావిటీ(Gravity). ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ సాండ్రా బుల్లక్ కథానాయికగా నటించగా.. అల్ఫోన్సో కారోన్ దర్శకత్వం వహించాడు. అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక సమస్య రాగా దానిని పరిష్కారించడానికి నలుగురు ఇంజనీర్లు అంతరిక్షం వెళతారు. ఇందులో డాక్టర్ రైయన్ స్టోన్ (సాండ్రా బుల్లక్)తో పాటు మాట్ కోవాల్స్కీ (జార్జ్ క్లూనీ) తదితరులు ఉంటారు. టెలిస్కోప్‌లో ఉన్న సమస్యను వీరు రిపేరు చేస్తుండగా.. ఉన్నట్టుండి రష్యన్ ఉపగ్రహం ధ్వంసం అవుతుంది. దీంతో ఉపగ్రహం ధ్వంసం వలన ఏర్పడిన శకలాలు హబుల్ టెలిస్కోప్ వైపు దుసుకువచ్చి వాటిని నాశనం చేయడంతో అందులో ఉన్న ఇద్దరు ఇంజనీర్లు అక్కడిక్కడే మరణిస్తారు. ఇందులో నుంచి బయటపడిన డాక్టర్ రైయన్ స్టోన్ అంతరిక్షంలో దారి తప్పుతుంది. అయితే కొన్ని రోజులు అంతరిక్షంలోనే గడిపిన రైయాన్ చివరికి భుమికి ఎలా చేరుకుంది అనేది ఈ సినిమా కథ. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఇంటర్స్టెల్లర్ (2014)
Interstellar
స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇంటర్స్టెల్లర్(). 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భవిష్యత్తులో భూమి నివాస యోగ్యంగా లేని స్థితికి చేరుకుంటుంది. పంటలు నాశనమవుతుంటాయి, తుఫానులు సర్వసాధారణమవుతాయి, మానవ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంటుంది. ఈ పరిస్థితిలో కూపర్ (మాథ్యూ మక్కనాఘీ) అనే మాజీ నాసా పైలట్ మానవాళిని రక్షించే క్రమంలో కొత్త గ్రహాన్ని వెతకడానికి ఒక వార్మ్‌హోల్ ద్వారా ప్రయాణిస్తాడు. అయితే అతడు మనవాళి కొత్త గ్రహాన్ని కనిపెడతాడా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ది మార్షియన్ (2015)
The Martian
రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మాట్ డామన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నాసా ఆరెస్ III మిషన్‌లో భాగంగా వ్యోమగాముల బృందం అంగారక గ్రహం (మార్స్)పై పరిశోధనలు చేస్తుంటుంది. ఈ బృందంలో మార్క్ వాట్నీ (మాట్ డామన్), ఒక బొటానిస్ట్ అలాగే మెకానికల్ ఇంజనీర్. అయితే మిషన్ సమయంలో ఒక భారీ ధూళి తుఫాను రావడంతో బృందం అత్యవసరంగా అంగారక గ్రహాన్ని వీడాలని నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే మార్క్ ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు, అయితే మార్క్ చనిపోయాడు అనుకున్న అతడి బృందం భూమికి తిరిగి వెళ్లిపోతుంది. కానీ మార్క్ బతికే ఉంటాడు, అంగారక గ్రహంపై ఒంటరిగా మిగిలిపోతాడు.
అయితే మార్క్ తన వద్ద ఉన్న పరిమిత వనరులతో బతకడానికి పోరాడతాడు. అతను హాబ్ (నివాస స్థలం)లో ఆక్సిజన్, నీరు, ఆహారాన్ని సృష్టించేందుకు తన శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. బంగాళదుంపలను పండించడం ద్వారా ఆహార సమస్యను పరిష్కరిస్తాడు. రోవర్‌ను ఉపయోగించి గ్రహంపై సంచరిస్తాడు. అలాగే పాత్‌ఫైండర్ అనే అంగారక ఉపగ్రహంతో భుమిపైకి తాను బ్రతికేఉన్నట్లు సంకేతాలు పంపుతాడు. ఈ విషయం తెలుసుకున్న నాసా అతడిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా కథ. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఫస్ట్ మ్యాన్ (2018)
First Man
అమెరికన్ వ్యోమగామి, ఏరోనాటికల్ ఇంజనీర్, చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మానవుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (Neil Alden Armstrong) జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రం ఫస్ట్ మ్యాన్. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా యానిమేషన్ రూపంలో వచ్చిన వాల్ ఈ, అవతార్ (డిస్నీ), స్టార్ వార్స్ (జియో హట్‌స్టార్) తదితర చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఇండియన్ సినిమాలో అంతరిక్షం ఆధారంగా వచ్చిన సినిమాలు చూసుకుంటే.. అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ చిత్రం ప్రస్తుతం జియో హట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇక తెలుగు చూసుకుంటే..
Mission Mangal
అంతరిక్షం (2018): ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సినిమాగా పరిగణించబడుతుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక ఉపగ్రహాన్ని రక్షించే మిషన్ చుట్టూ తిరుగుతుంది. దీనిని సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు మరియు ఇది డిసెంబర్ 20, 2018న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతరిక్ష సాహసాలను పరిచయం చేసిన మొదటి ప్రయత్నంగా గుర్తింపు పొందింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
టిక్ టిక్ టిక్ (2018): ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా డబ్ చేయబడి విడుదలైంది. భారతదేశం నుండి వచ్చిన మొదటి అంతరిక్ష చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా, ఒక ఉల్కాపాతం భూమిని తాకకుండా ఆపే కథాంశంతో రూపొందింది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 2018లో విడుదలై, తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ పొందింది. దీని గురించి సోషల్ మీడియాలో అప్పట్లో చాలా చర్చ జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
Tik Tik