Mahareddy Bhupal Reddy | పెద్దశంకరంపేట, జూన్ 08 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాయలంలో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.
పెద్ద శంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన జింక కాశీరాం దవాఖాన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.27 వేలు సీఎం రిలీప్ఫండ్ చెక్కు అందజేశారు. నిజాంపేట మండలం నాడదర్ గ్రామానికి చెందిన చిన్న నాయకుని బాలయ్యకు రూ.60 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనం అంజయ్య, గోవింద్, అడివప్ప, సాయిలు, రాంగొండ, నారాగౌడ్, రాజు, తదితరులున్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి