Ritu Tawde | ముంబై మేయర్‌గా బీజేపీ నేత రితూ తావ్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘాడి నామినేషన్లు
Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు.
Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కూటమి మెజారిటీ స్థానాలు సంపాదించింది. అయితే, మేయర్ పదవి విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది.
తాజాగా కూటమి తరఫున ముంబై మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేయగా, డిప్యూటీ మేయర్ స్తానం కోసం శివసేన నేత సంజయ్ శంకర్ ఘాడీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 227 స్థానాలున్న బీఎంసీలో మహాయుతి కూటమి 118 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ 89 సీట్లు, శివసేన (షిండే) 29 సీట్లు గెలుచుకుంది. మేయర్‌గా పోటీ పడుతున్న రితూ తావ్డే 132 వ వార్డు అయిన ఘట్కోపర్ నుంచి గెలుపొందారు. ఆమె ఇప్పటివరకు మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. రితూ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. 2012లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీఎంసీ దేశంలోనే అతిపెద్ద స్థానిక సంస్థ (కార్పొరేషన్). ఈ సంస్థ గత ఏడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది. బీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం.
ఇక.. పాతికేళ్ల తర్వాత శివసేన ముంబై మేయర్ పదవి కోల్పోనుంది. 1997 నుంచి ఆ పార్టీయే మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈసారి మాత్రం శివసేన (యూబీటీ) 65 స్తానాలు మాత్రమే గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఎమ్మెన్నెస్ 6 సీట్లు, ఎన్సీపీ (శరద్ పవార్) ఒక సీటు, కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం 8 సీట్లు, ఎస్పీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, మహాయుతి కూటమిలోనే ఉన్నప్పటికీ అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ సొంతంగా బరిలోకి దిగింది. కేవలం 3 సీట్లే గెలుచుకుంది. ఈ మూడు సీట్లు కూడా ఇప్పుడు మహాయుతి కూటమిలో భాగంగానే ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- BMC
- Mumbai Mayor
- Ritu Tawde
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

