SS Karthikeya | హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
SSKarthikeya | హైదరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న దోమల సమస్యపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్ఎస్ కార్తీకేయ తనదైన శైలిలో స్పందించారు.
Hyderabad Mosquitoes | హైదరాబాద్ నగరంలో దోమల ఉధృతి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకపోవడంతో ఇదే విషయాన్ని సెటైరికల్‌గా తెలియజేశాడు ఎస్ఎస్ కార్తీకేయ.
ప్రస్తుతం కార్తీకేయ ఒక సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అర్థరాత్రి జరుగుతున్న ఈ షూటింగ్లో దోమలు విపరీతంగా ఉండటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వ్యంగ్యంగా చూపిస్తూ కార్తీకేయ ఒక వీడియోను చిత్రీకరించారు. షూటింగ్ లైట్ల వెలుతురులో దోమలు గుంపులు గుంపులుగా తిరుగుతున్న దృశ్యాలను ఆయన కెమెరాలో బంధించారు.
‘హైదరాబాద్ దోమలు మామూలుగా లేవు.. షూటింగ్ చేయడం కూడా కష్టమైపోతోంది’ అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజమౌళి గారి సినిమాలో గ్రాఫిక్స్ లాగా ఈ దోమలు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి?” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు హైదరాబాద్ మున్సిపల్ అధికారులను, ప్రభుత్వాని ట్యాగ్ చేస్తున్నారు. కార్తీకేయ పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నగరంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.
హైదరాబాద్ దోమల సమస్యపై సెటైరికల్ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయ pic.twitter.com/U0orlNGngM
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

