Edupayala | పాపన్నపేట, ఆగస్టు 11 : ఏడుపాయల హుండీ ఆదాయం రూ.26 లక్షల 59 వేల 9 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. ఏడుపాయలలోని గోకుల్ షెడ్లో సోమవారం హుండీ ఆదాయం లెక్కింపు కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్ ,సహాయ కమిషనర్ సులోచన పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కొనసాగింది. 45 రోజులకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏడుపాయల సిబ్బంది సూర్య శ్రీనివాస్, శ్యామ్, ప్రతాప్ రెడ్డి ,శ్రీనివాస్ శర్మ ,బ్రహ్మచారి, రాజు, నరసింహులు, వరుణాచారి తదితరులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పాపన్నపేట పోలీసు సిబ్బందితో తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ