పాపన్నపేట, ఏప్రిల్ 11 : వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ కార్యక్రమాలైన ఎయిడ్స్, ఫైలేరియా, కుష్టు వ్యాధి, మలేరియా తదితర రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ హరిప్రసాద్, పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అన్వర్, సీహెచ్ఓ డాక్టర్ చందర్, శ్రీనివాస్ రెడ్డి ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ICC | టెస్టుల్లో టైమర్.. కీలక మార్పులకు ‘సై’ అంటున్న ఐసీసీ..!
Watch: మహిళ, ఆమె కుమార్తెను దారుణంగా కొట్టిన ఇద్దరు.. తర్వాత ఏం జరిగిందంటే?
Egg price | అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. ఎంతో తెలిస్తే షాకే..!