Egg price | రోజుకో గుడ్డు (Egg).. హెల్త్‌కి వెరీ గుడ్డు అని అంతా అంటుంటారు. అంటే రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అని అర్థం. అయితే, గుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోవడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. మన దేశంలో ఒకప్పుడు ఒక గుడ్డు రూ.3 నుంచి రూ.4 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో గుడ్డు రూ.6 పైనే ఉంది. డజను గుడ్లు కొనాలంటే రూ.72 అవుతుంది. ఈ ధరకే ప్రజలు అమ్మో గుడ్లా అంటున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కోడిగుడ్లు కొండెక్కి కూర్చున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. 2023 ఆగస్టులో డజను గుడ్ల ధర 2.04 డాలర్లు (రూ.175)గా ఉండేది. ఈ ఏడాది మార్చి నాటికి వాటి ధర గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో రూ.508.76 అన్నమాట. ఇక మార్చి నెలలో వాటి ధర 6.23 డాలర్ల (రూ.536)కు చేరింది. దీంతో అమెరికన్లు గుడ్లు కొనాలంటేనే వామ్మో అంటున్నారు. యూఎస్‌లో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటడం వెనుక ప్రధాన కారణం బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు 3 కోట్ల గుడ్లుపెట్టే కోళ్లను ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో నిర్మూలించింది అగ్రరాజ్యం. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లోని గుడ్ల ధరలపై పడింది. ధరల పెరగడంతో కొనుగోళ్లు కూడా తగ్గినట్లు తెలుస్తోంది.
Also Read..
Tariffs | చైనాపై బాదుడే బాదుడు.. 145 శాతానికి పెరిగిన ట్రంప్ టారిఫ్‌లు
Google LayOffs | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో లేఆఫ్స్.. వందలాది మందిపై వేటు..!
Afghanistan | పురుషులపైనా ఆంక్షలే.. జుట్టు అందంగా కత్తిరించుకుంటే జైలుకే