Afghanistan | పురుషులపైనా ఆంక్షలే.. జుట్టు అందంగా కత్తిరించుకుంటే జైలుకే
Afghanistan | అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు (Talibans).. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.
Afghanistan | అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు (Talibans).. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘాన్ (Afghanistan)ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా పాలకుల ఆంక్షల వల్ల ఆఫ్ఘాన్ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పురుషులు కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరారు. ఆప్ఘాన్ పురుషులపై అక్కడి పాలకులు పలు ఆంక్షలు విధించినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.
ఆధునిక పోకడలకు పోయి జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులు ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందేనంట. జుట్టును కత్తిరించుకున్న వాళ్లే కాదు.. వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారంట. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, క్షవరం, సంగీతం, పండుగ రోజుల్లో సందడిపై గతేడాది ఆగస్టులో తాలిబన్ పాలకులు ప్రత్యేక నియమావళి విడుదల చేశారు. ఆ నియమావళి ప్రకారం.. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదు. బిగ్గరగా మాట్లాడకూడదు.
దీనిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 3,300 మంది ఇన్స్పెక్టర్లను నియమించింది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమంది గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకోని, క్షవరం చేయించుకోని పురుషులు, వారి క్షురకులే ఉండటం గమనార్హం. అంతేకాదు, రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజు చేయని వారిని కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
Also Read..
Tariffs | చైనాపై బాదుడే బాదుడు.. 145 శాతానికి పెరిగిన ట్రంప్ టారిఫ్లు
Google LayOffs | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్లో లేఆఫ్స్.. వందలాది మందిపై వేటు..!
Helicopter Crash: హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

