Google LayOffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు లేఆఫ్‌లు (LayOffs) ప్రకటించింది.
ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్ విషయం వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఎంతమందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందన్నది కచ్చితంగా తెలియరాలేదు. కాగా, గూగుల్ నాలుగు నెలల క్రితం అంటే 2024 డిసెంబర్లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్.ఎఫ్వై వెబ్సైట్ వివరాల ప్రకారం, 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. 2023లో 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Also Read..
Tahawwur Rana | భారత్‌కు తహవ్వుర్ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల
Tamil Nadu | రుతుస్రావమైందని విద్యార్థినికి తరగతి బయట పరీక్ష.. ప్రిన్సిపల్ సస్పెన్షన్!