Tamil Nadu | చెన్నై : తమిళనాడు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థినికి రుతుస్రావం కావడంతో, స్కూల్ ప్రిన్సిపల్ ఆ అమ్మాయిని తరగతి గది బయట కూర్చొబెట్టి పరీక్ష రాయించారు. బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని. ఈ అమానుష ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం విద్యాశాఖ సదరు స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రకారం.. బాధితురాలు తనను ప్రిన్సిపల్ ఇలా క్లాస్రూమ్ బయట గతంలోనూ పరీక్ష రాయించారని తన తల్లితో చెప్పింది. ఘటనపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అణ్బిల్ మహేశ్ స్పందిస్తూ.. పిల్లలపై అణచివేతను సహించమని చెప్పారు.