నెమ్మదించిన పబ్లిక్ ఇష్యూలు
ప్రైమరీ మార్కెట్లో నిధుల సమీకరణ నెమ్మదించింది. మార్చి తొలి వారంలో మదుపరులకు ఒకే ఒక మెయిన్‌బోర్డ్ ఐపీవో సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటున్నది మరి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రైమరీ మార్కెట్లో నిధుల సమీకరణ నెమ్మదించింది. మార్చి తొలి వారంలో మదుపరులకు ఒకే ఒక మెయిన్‌బోర్డ్ ఐపీవో సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటున్నది మరి. అలాగే మరో చిన్న మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ) సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నది. అయితే 9 కంపెనీలు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లలో లిస్ట్ కాబోతున్నాయి. మార్చి 2 నుంచి 6 మధ్య వీటి లిస్టింగ్ జరుగబోతున్నది. ఇక మెయిన్‌బోర్డ్ ఐపీవోగా.. సెడెమాక్ మెఖాట్రోనిక్స్ మార్చి 4 నుంచి 6 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నది. బుధవారం మొదలై శుక్రవారం ముగుస్తుంది. నిధుల సమీకరణ లక్ష్యం రూ.1,087.50 కోట్లు. దీని షేర్ ధరల శ్రేణి రూ.1,287-1,352గా ఉన్నది. మార్చి 9న షేర్ అలాట్‌మెంట్‌కు వీలున్నది. 11న స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావచ్చని అంచనా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, అవెండస్ క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్.. లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. ఇక ఎస్ఎంఈ విభాగంలో ఎల్ఫిన్ అగ్రో ఇండియా ఐపీవోకు వస్తున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ 5న మొదలై 9న ముగుస్తుంది. 10న షేర్ అలాట్మెంట్, 12న బీఎస్ఈ ఎస్ఎంఈ వేదికపై లిస్టింగ్‌కు వీలున్నది. ఐపీవో విలువ రూ.25.03 కోట్లుగా ఉన్నది.
మార్చిలో లిస్టింగ్ సంస్థలివే..సంస్థ తేదీ
- క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ = 2
- శ్రీరామ్ ట్విస్టెక్స్ = 2
- పీఎన్‌జీఎస్ రేవా డైమండ్ = 4
- ఓమ్నీటెక్ ఇంజినీరింగ్ = 5
- కైసా రిటైల్ = 2
- ఎకార్డ్ ట్రాన్స్ఫార్మర్ = 2
- మొబిలైజ్ యాప్ ల్యాబ్ = 2
- యాప్ డిజిటల్ = 5
- స్ట్రెయిడర్స్ ఇంపెక్స్ = 6
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

