హైదరాబాద్, ఫిబ్రవరి 28: అపోలో హాస్పిటల్స్‌కు చెందిన అపోలో ఫార్మసీ మరో మైలురాయికి చేరుకున్నది. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేసిన 1,000వ స్టోర్‌ను కంపెనీ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వచ్చే మూడేండ్లకాలంలో మరో 200కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ తెలంగాణలోని 33 జిల్లాలో వెయ్యి స్టోర్లను నిర్వహిస్తున్నదని, తద్వారా పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రిటైల్‌తోపాటు ఆన్లైన్లో కూడా ఔషధాలను డెలివరీ చేస్తున్నది. ప్రతిరోజూ 1.65 లక్షల మెడిసిన్ ఆర్డర్లు వస్తున్నాయన్నారు.