Tahawwur Rana | ముంబై 26/11 పేలుళ్ల కేసులో (Mumbai Terror Attacks) ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana)ను భారత్కు విజయవంతంగా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అతడిని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసి న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసింది.
అయితే, అమెరికాలో యూఎస్ మార్షల్స్ (US Marshals) రాణాను భారత్కు (Indian Officers) అప్పగిస్తున్న తొలి ఫొటో బయటకు వచ్చింది. అందులో ఓ సురక్షిత ప్రదేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధుల కస్టడీకి రాణాను యూఎస్ మార్షల్ అప్పగిస్తున్నట్లు ఉంది. ఈ ఫొటోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
166 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న 2008 ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. అతడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. 2009 నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను ఆ దేశం బుధవారం అధికారికంగా భారత్కు అప్పగించడంతో ఎన్ఐఏ, నేషనల్ సెక్యూరిటీ గార్డుల రక్షణలో గురువారం అతడిని భారత్కు తీసుకువచ్చినట్టు అధికారులు ప్రకటించారు.
Also Read..
భారత్కు చేరుకున్న తహవ్వుర్ రాణా
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?