Helicopter Crash: హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Helicopter Crash: న్యూయార్క్ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో ఆ హెలికాప్టర్ కూలింది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మృతులను గుర్తించారు. స్పెయిన్లోనీ సీమెన్స్ కంపెనీ సీఈవో ఫ్యామిలీ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
న్యూయార్క్: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో(Helicopter Crash) ఆరుగురు మృతిచెందారు. న్యూయార్క్ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో ఆ హెలికాప్టర్ కూలింది. మధ్యాహ్నం 3.17 నిమిషాలకు నది నీటిలో హెలికాప్టర్ ఉన్నట్లు ఫోన్ వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నది. నది నీటిలో హెలికాప్టర్ పూర్తిగా మునిగిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా స్పష్టమైంది. మన్హటన్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. హడ్సన్ నది సమీపంలో గతంలో కూడా హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. 2009లో ఓ ప్లేన్ను టూరిస్టు హెలికాప్టర్ ఢీకొన్నది. ఆ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు.
BREAKING: Agustin Escobar, President and CEO of Siemens in Spain, along with his wife and their three children, were identified as the victims of the helicopter that plunged into the Hudson River in New York City on Thursday, according to the New York Post.
The New York… pic.twitter.com/cGOiJWGFAx
— RedWave Press (@RedWave_Press) April 11, 2025
ఇవాళ్టి ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను గుర్తించారు. స్పెయిన్లోని సీమెన్స్ కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ ఆగస్టిన్ ఎస్కోబార్ తన ఫ్యామిలీతో పాటు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఆయన భార్య, ముగ్గురు పిల్లలు ప్రమాదంలో చనిపోయారు. బెల్ 206ఎల్-4 కంపెనీకి చెందిన లాంగ్రేంజ్ ఫోర్ హెలికాప్టర్ వద్ద ఫ్యామిలీతో కలిసి సీఈవో ఫోటో దిగారు. ఆ ఫోటోను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ వెబ్సైట్లో పోస్టు చేశారు. బార్సిలోనా నుంచి ఆ ఫ్యామిలీ న్యూయార్క్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పైలెట్ పరిస్థితి ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

