దేవరకొండ : కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన ఆనంద్ తోపాటు 50మంది రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
రెండేళ్లలో పైసా పని చెయ్యని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలోనే దేవరకొండ అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షడు టీవీఎన్ రెడ్డి, 2వ వార్డు అభ్యర్థి పొట్ట మురళి, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసీరామ్, వడత్య బాలు, శ్రీను, నేనావత్ నాగార్జున, పెద్దయ్య, అందుగుల సైదులు, కొమ్ము ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.