Ritika Nayak | అశోకవనంలో అర్జుణ కళ్యాణం సినిమాలో సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రితికా నాయక్. ఆ తర్వాత మిరాయి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. వీటిలో ఒకటి డ్యుయెట్ కాగా.. మరో సినిమా కొరియన్ కనకరాజు. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ నేపథ్యంలో వరున్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు.
మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ భామ రీసెంట్గా కొన్ని ఫోటోలను నెట్టింట దర్శనమిచ్చి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. వైబ్రాంట్ ఫ్లోరల్ స్క్టర్ట్, వైట్ షర్ట్ వేసుకున్న రితికా నాయక్ గోల్డెన్ కలర్ జ్యువెలరీతో తళుక్కున మెరుస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. మిరాయి బ్యూటీ కొరియన్ గర్ల్‌గా మారితే ఇలా ఉంటుందని చెప్పకనే చెబుతూ కుర్రకారు గుండెలను పిండేస్తుంది రితికానాయక్. చబ్బీచబ్బీగా క్యూట్ లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.