అహ్మదాబాద్: కూరగాయలు దొంగిలించారన్న ఆరోపణలతో ఒక మహిళ, ఆమె కుమార్తె పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. వారి జుట్టుపట్టుకుని ఈడ్చి కడుపులో తన్నడంతోపాటు కర్రలతో కొట్టారు. (Woman, Daughter Thrashed) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి లాఠీలతో కుళ్లబొడిచారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది.
ఏప్రిల్ 10న సూరత్‌లోని మార్కెట్లో ఒక మహిళ, ఆమె కుమార్తె కూరగాయలు దొంగిలించినట్లు కొందరు వ్యక్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. మహిళల జుట్లు పట్టుకుని ఈడ్చారు. వారి కడుపులో తన్నారు. ఆ మహిళలను కర్రలతో దారుణంగా కొట్టారు. అక్కడున్న వారు చోద్యం చూశారు. ఎవరూ కూడా వారిని రక్షించేందుకు ప్రయత్నించలేదు.
కాగా, ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో తల్లీకుమార్తెలను దారుణంగా కొట్టిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిద్దరిని లాఠీలతో కుళ్లబొడిచారు. గాయాలతో కుంటుతున్న నిందితులను మీడియాకు చూపించారు. సూరత్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
સુરત APMCમાં શાકભાજી ચોરીના આક્ષેપ બાદ મહિલા અને એક યુવતી પર કરાયેલ હુમલાની ઘટનામાં સુરત શહેર પુણા પોલીસે બે આરોપીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#surat #suratcitypolice #suratpolice #suratcitypunapolice #puna #punapolice pic.twitter.com/PhFViMPV68— Surat City Police (@CP_SuratCity) April 10, 2025