Dr BR Ambedkar | రామాయంపేట రూరల్, ఏప్రిల్ 12 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఎంతో స్పూర్థిదాయకరమని అంబేద్కర్ దళిత యువరత్న అవార్డు గ్రహీత, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కర్రె రమేష్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో ఎంతో స్వేచ్చ, సమానత్వం, పరిపాలన విధానం తదితర విధానాలు అంబేద్కర్ కృషి ఫలితమే అన్నారు.
దేశ స్వాతంత్రోద్యమంలో ఉద్యమకారుడుగా, న్యాయవాదిగా, కేంద్రమంత్రిగా ఎన్నో గొప్ప పదవులు చేపట్టడంతోపాటు రాజ్యాంగ నిర్మాణంలో కీలక వ్యక్తిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.
ఏప్రిల్ 14వ తేదీన ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఏ ఒక్కరి కోసం కాకుండా దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేసిన అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి తరానికి ఎంతో మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఆయన చూపిన బాటలో నడిచి ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే గౌరవం అన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!