Grain Purchase Centres | మెదక్ రూరల్, నవంబర్ 10 : మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించి ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.
తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి.. ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. సరిపడా టార్ఫాలిన్లను అందుబాటులో పెట్టుకోవాలని.. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన వర్షం వచ్చే సూచనలు తెలిసినప్పుడు కేంద్రంలో ఉన్న ధాన్యం తడవకుండా.. వెంటనే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని.. ఇప్పటివరకు 70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం