DJ Youth | నర్సాపూర్, సెప్టెంబర్ 22 : ఓ యువకుడు సొంతగా డీజే మెయింటైన్ చేయాలనుకున్నాడు. అప్పులు చేసి మరి డీజేను కొనుగోలు చేశాడు. అయితే డీజే కోసం చేసిన అప్పు తీర్చలేక సదరు యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి శివప్రసాద్(22) గత రెండు సంవత్సరాల క్రితం డీజే బాక్సులను కొనుగోలు చేశాడు.
శివప్రసాద్ ఇందుకోసం తనకు తెలిసిన వారి దగ్గర రూ.3,15,000 అప్పు చేయడం జరిగింది. చేసిన అప్పును ఎలా తీర్చాలో అని శివప్రసాద్ తన తండ్రి గాలి రమేశ్‌తో అప్పుడప్పుడు చెప్తూ బాధపడేవాడు. అదే విషయంతో మనస్థాపం చెంది ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు తన తండ్రి రమేశ్‌తో అప్పుల గురించి మాట్లాడాడు. శివప్రసాద్ వారి పొలం దగ్గరున్న గల కోళ్ల ఫారం వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లాడు. అయితే శివప్రసాద్ ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు కోళ్లఫారం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే కోళ్ల ఫారం రేకుల షెడ్డుకు తాడుతో వేలాడుతూ కనిపించాడు.
చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి పిలిచి శివప్రసాద్‌ను కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా దవాఖానా మార్చురీకి తరలించారు. శివప్రసాద్ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. శివప్రసాద్ స్నేహితులు, బందువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నర్సాపూర్ నుండి తుజాల్పూర్ వరకు మృతదేహాన్ని బైక్ ర్యాలీతో తీసుకెళ్ళారు.
Stray dogs | పెద్దపొర్ల గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం.. పలువురికి గాయాలు
Medical Seat | నీట్ యూజీ పరీక్షలో ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్