కుర్రాళ్లకు జహీర్, భజ్జీతో పాఠాలు
ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్పాటుచేసింది.
- బీసీసీఐ ప్రత్యేక శిక్షణా శిబిరాలు
బెంగళూరు: ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్పాటుచేసింది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌తో యువ పేసర్లకు ఐదు రోజుల స్పెషల్ క్యాంప్‌ను ఏర్పాటుచేసింది. జహీర్ ఇప్పటికే సీవోఈలో యువ బౌలర్లకు సూచనలిస్తున్నాడు. అలాగే ఆఫ్ స్పిన్నర్ల కోసం హర్భజన్ సింగ్‌తో, రిస్ట్ స్పిన్నర్ల కోసం అనిల్ కుంబ్లేతోనూ ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటుచేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అత్యుత్తమ ప్రతిభ కల్గి ఉండి జాతీయ జట్టుకు ఆడగలిగే సామర్థ్యం ఉన్న క్రికెటర్ల కోసం ఈ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని బీసీసీఐ భావిస్తున్నది. ఈ మేరకు సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన మాజీ సహచరులతో సంప్రదింపులు జరిపాడని, త్వరలోనే భజ్జీ, కుంబ్లే యువ బౌలర్లకు స్పిన్‌లో మెళుకువలు నేర్పిస్తారని సీవోఈ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

