Edupayala Temple | పాపన్నపేట, మార్చ్ 16 : భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన ఏడుపాయల వనదుర్గ భవాని మాతను దర్శించుకోవడానికి సెలవు దినాల్లో భక్తులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వస్తారు. ఏడుపాయల ఆదాయం సైతం సంవత్సరానికి రూ.10 కోట్లపైనే ఉంటుంది. సంబంధిత అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రతీ ఏటా ఎండాకాలం ప్రారంభంలో రాజగోపురం నుండి ఆలయం వరకుపైన తడకలు, కింద మ్యాట్లు ఏర్పాటు చేస్తారు. ఈ సారి కేవలం లడ్డు కౌంటర్ వరకు ఏర్పాటు చేయడంతో అమ్మవారి దర్శనం కోసం రాజగోపురం నుండి చెప్పులు లేకుండా వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వారితోపాటు బోనాలు తీసే మహిళలు సైతం అమ్మవారి పవిత్రత కాపాడేందుకు భక్తి భావంతో చెప్పులు వదిలి వెళుతుంటారు. వీరితోపాటు వృద్ధులు చిన్న పిల్లలు ఎండ వేడిమికి కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి.
ముఖ్యంగా అమ్మవారి ఆలయం చుట్టూ రాళ్ల గుట్టలు ఉండడం మూలంగా ఏడుపాయలలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. రాజగోపురం నుండి ఆలయం వరకు కనీసం తాగునీటి వసతి లేక చిన్న పెద్ద ప్రతీ ఒక్కరు నోరు ఎండి తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అక్కడ ఎవరైనా దప్పికేస్తే నదిలో నీళ్లు తాగాల్సిందే లేదా వాటర్ బాటిల్ కొనాల్సిందే.. వీటి ధర కూడా ఏడుపాయలల్లో విపరీతంగా పెంచి అమ్ముతారు. ఇటీవల కాలంలో ఏడుపాయల ఆలయ అధికారి నిర్లక్ష్యం మూలంగా కనీస వసతులు కరువవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఏడుపాయల జాతరలో సైతం సరైన వసతులు లేక ఈ ఏడు భక్తుల సంఖ్య తగ్గిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతం కంటే ఈ ఏడు అమ్మవారి ఆలయ ఆదాయం భారీగా తగ్గిన విషయం విధితమే. సంబంధిత అధికారి సైతం స్థానికంగా ఉండక ఏడుపాయలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు