Medak Church | మెదక్ మున్సిపాలిటీ, జూలై 13 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక పార్థనల అనంతరం చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జ్ రెవరెండ్ శాంతయ్య, ఫాస్టర్లు శ్రీనివాస్, జైపాల్, డేవిడ్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపాలంటూ భక్తులను ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు చర్చి ప్రాంగణంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. ఈ ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సంశాన్ సందీప్, జాన్సన్, సువన్ డగ్లస్. జాయ్ ముర్రే, వికాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం